Saturday, December 18, 2010

నా మనసా...

ఆ కళ్ళనే  చూస్తూ  గడిపేస్తున్నా....
రోజులు  గంటలై ...గంటలు  నిమిషాలై ..
నా "జీవితం" మొత్తం ఆ  "కళ్ళ"  లోనే ఉంది అనిపించేంతగా...ఉంది...ఏముంది ఆ "కళ్లలో"...
రెప్ప వేయటమే మరిపించావు.....కనుపాపకి అంతగా తోడువి అయ్యావు...ఎలా???...
ఆకాశమంత ప్రేమని అంతా ఆ కళ్ళలోనే నింపుకున్నావు...చూపుల నిండుగా ఆ ప్రేమను కురిపిస్తావు...
నా మనస్సు మొత్తం ప్రేమతో మున్చెస్తున్నావు...ఇంకేమి గుర్తుకు రాకుండా....
అంత పనిలో కూడా గుర్తొస్తావు...చిరు నవ్వుని  తెప్పిస్తావు...అంత మాయ ఏముంది నీ దగ్గర...
అన్నం కలుపుతుగా ఉండగా ఎదురుగా వచ్చి మొదటి ముద్దని తినిపిస్తావు అంత ప్రేమతో...ఇంక ఆకలి 
ఏముంటుంది?...
ఇన్ని నాళ్ళుగా నా మనస్సు ...వెతికింది, అంతగా ఎదురు చూసింది...నిన్నే కదా...
ఆయినా ఎందుకు అందనంత దూరంలో ఉండిపోతావు...అక్కడి నుండే అంతలా 
చూస్తావు...ఏమయిపోతానో...ఆలోచించావా??...అస్సలు...
ఇన్ని నాళ్ళ ఇంత ఎడబాటుని...ఒక చిన్న చిరునవ్వుతో చెరిపేస్తావు...ఏదో మంత్రం వేసినట్లు...
జీవితం అంతా బ్రతికింది...
నిన్నే వెతుకుతు...నీ శ్వాసగా బ్రతుకుతూ....నీకోసమే నేను జీవించి,నిన్ను చేరుకునే క్షణం కోసం వేచి ఉన్న నా కోసం...
నీకై బ్రతుకుతున్నా 
నీ నేను..
నిన్ను చేరుకోవటం కోసమే....
నా మనసా....నా ప్రాణమా...నా సరవస్వమా...