Saturday, December 18, 2010

నా మనసా...

ఆ కళ్ళనే  చూస్తూ  గడిపేస్తున్నా....
రోజులు  గంటలై ...గంటలు  నిమిషాలై ..
నా "జీవితం" మొత్తం ఆ  "కళ్ళ"  లోనే ఉంది అనిపించేంతగా...ఉంది...ఏముంది ఆ "కళ్లలో"...
రెప్ప వేయటమే మరిపించావు.....కనుపాపకి అంతగా తోడువి అయ్యావు...ఎలా???...
ఆకాశమంత ప్రేమని అంతా ఆ కళ్ళలోనే నింపుకున్నావు...చూపుల నిండుగా ఆ ప్రేమను కురిపిస్తావు...
నా మనస్సు మొత్తం ప్రేమతో మున్చెస్తున్నావు...ఇంకేమి గుర్తుకు రాకుండా....
అంత పనిలో కూడా గుర్తొస్తావు...చిరు నవ్వుని  తెప్పిస్తావు...అంత మాయ ఏముంది నీ దగ్గర...
అన్నం కలుపుతుగా ఉండగా ఎదురుగా వచ్చి మొదటి ముద్దని తినిపిస్తావు అంత ప్రేమతో...ఇంక ఆకలి 
ఏముంటుంది?...
ఇన్ని నాళ్ళుగా నా మనస్సు ...వెతికింది, అంతగా ఎదురు చూసింది...నిన్నే కదా...
ఆయినా ఎందుకు అందనంత దూరంలో ఉండిపోతావు...అక్కడి నుండే అంతలా 
చూస్తావు...ఏమయిపోతానో...ఆలోచించావా??...అస్సలు...
ఇన్ని నాళ్ళ ఇంత ఎడబాటుని...ఒక చిన్న చిరునవ్వుతో చెరిపేస్తావు...ఏదో మంత్రం వేసినట్లు...
జీవితం అంతా బ్రతికింది...
నిన్నే వెతుకుతు...నీ శ్వాసగా బ్రతుకుతూ....నీకోసమే నేను జీవించి,నిన్ను చేరుకునే క్షణం కోసం వేచి ఉన్న నా కోసం...
నీకై బ్రతుకుతున్నా 
నీ నేను..
నిన్ను చేరుకోవటం కోసమే....
నా మనసా....నా ప్రాణమా...నా సరవస్వమా... 

Friday, July 2, 2010

తుది శ్వాస వరకు...

ఎందుకు? అంతగా గుర్తొస్తావు? అసిలింతగా నన్ను ఎలా మార్చావు...? గుర్తుకు వచ్చే అప్పటికే నేను ఉన్నాను అంటూ పలికరిస్తావు...ఎలా? 
మెలకువగా ఉన్నా నిదురించి ఉన్నా అసలు ఎం చేసినా " నువ్వేనా" ?? ఎప్పుడు నీ ధ్యాసేనా??  
నీకోసమే అనుక్షణం బ్రతికేంతగా ఎలా మార్చావు....
చిన్న చిరునవ్వుతో నా ప్రపంచాన్నే మర్చేస్తావు...నీతోడితే ప్రపంచం చేసావు...
ఓర చూపుతో నన్ను కట్టి పడేసావు...మరి జాలి లేకుండా....
మాటల మల్లెలు విసురుతావు...ఎదకు తీయని  గాయం చేసేలా..కనికరమే లేదా నీకు....
ప్రతి క్షణం జీవించమని చెబుతావు...కాని ప్రతి క్షణం నీ కోసమే జీవించేటట్లు చేస్తావు...
ఎం? నా జీవితంలో ఇంక దేనికి స్థానం వద్దా???
నా  మనసుని అడిగాను నువ్వు తప్ప ఇంకేది వద్దంది... అస్సలు వద్దు అంది...
అంతగా ఎం చేసావు??
నా ఊహ..నా కల... నా వాస్తవం...నా ప్రపంచం... నా జీవితం... అన్ని నీవే..నీకొరకే....
నా తుది శ్వాస వరకు....

Wednesday, December 2, 2009

కళ్ళ ముందు నువ్వు....

ఎందుకు అలా చూస్తున్నావు.....
నన్ను ఎందుకు అలా చూస్తున్నావు...
వేల గులాబీల పరిమళం ఒకే సారి నన్ను చుట్టిముట్టినట్లు...మంచుకొండలలో నుంచిని ఉనట్లు....
అసలింతకి నాకు భూమికి ఎంత దూరం ఉందో కూడా తెలియటం లేదు...
ఎందుకు అలా చూస్తున్నావు...
ప్రేమంతా నీ కళ్ళ నుండే వర్షిస్తుందా...నీ కళ్ళలోన నా రూపం చూసే నా కనులకి ఎంత అదృష్టం...ఎప్పటికి ఇలానే..నీ కనులలోనే నిలిచి ఉండిపోతాను...నీ కనుపాప రూపాన్నిఅయ్యి ...
మనసు, తనువు ఇంతిలా హాయిగా ఇంత ఆనందం పొందుతాయని....నీ తలపులలో సేద తీరుతాయని...
ఇంత మంచి అనుభూతిని పంచడానికే వచ్చావా...

నీ కళ్ళలోనికి చూస్తూ నీ 'నేను' నా 'నేను' కాదా? అంతలా నన్ను ఎందుకు మార్చావు...అసలు ఎలా మార్చావు...
అదిగో మళ్లి చూస్తున్నావు...మల్లెలు గుభాలింపులో, రాలే స్వాతి చినుకులలో...నీ నవ్వే...నీ చూపే...నీ రూపే...

Friday, September 18, 2009

అను క్షణం నీ ధ్యాసే.....

అలజడి...
తియ్యనది...నీవు రేపిందే కదా!
మాట కలిపి మనసు దోచి...నాకు నేను కాకుండా చేసావు ఇది న్యాయమా!
నా చిరునవ్వు, ఆకలి, నిద్దుర అన్ని పోగొట్టు కున్నాను నా మనసుని అడిగా వాటి జాడ చెప్పమని...
తెలుసుకున్నాను అన్ని నీ దగ్గరే ఉన్నాయని....అన్ని క్షేమమేనా....
మనసు నా మాటే వినటం లేదు ఎప్పుడు నీ ధ్యాసే...ఎందుకు అని కసురుకున్నాను నీకు నేను వద్దా ఎప్పుడు ఆమె గురించేనా అని అడిగాను ఉహు వింటేనే కదా ఎంతైనా నా మనసు కదా మొండి మహా మొండి...
ఏమం చేసావు నన్ను ఇంతిలా...
కాని నన్ను నాకు కాకుండా చేసావు...
ప్రేమ ఇంత బావుంటుందా...
బావుంది
చాలా చాలా చాలా బావుంది..
ఇంత ఆనందాన్ని ఇచ్చినా నిన్ను ఎన్ని జన్మలు ప్రేమిస్తే ఈ ఋణం తీర్చుకోను...మరణిస్తే మల్లి పుట్టి నిన్నే ప్రేమిస్తా...ఎప్పటికి...
నీ
నేను

Friday, September 11, 2009

మనసు తపన...హృదయ స్పందన అన్ని నీవే...

ఎన్నో ఆశలు మరెన్నో ఊహలు...మధురం మధురాతి మధురం మనసు చూసేవి అవే...కాని కనిపించేది వాస్తవం ???
ఇంకా మధురం..కళ్ళతో కాదు మనసుతో చూస్తున్న నేను...ఆ అనుభూతి పొందుతున్నా....మనసుతోనే చూస్తున్నా...లోకం అమోఘం...ఇలానే ఊహాలోకం లోనే ఉండిపోనా..

మనసు తెరిచి చూస్తే ఎన్నెన్ని పులకింతలు...ఎన్నెన్ని ప్రేమ కధలు...
ప్రేమ ఇంత బాగుంటుందా ప్రేమిస్తే ఇంత హయా...మరెందుకు ఇంత వరకు నా మొదటి ప్రేమ కధ మొదలుకి ఇంత ఆలస్యం...
రోజుకో ప్రేమకధ నీతో ఉన్న గంటలు అసలెందుకు గురతుకు రావు మళ్లి మళ్లి నిన్నే చూడాలన్న ఆత్రుత నీ సాంగత్యం కోసమే తపన...
నన్ను ఇలా హింసించి నువ్వు నవ్వుకుంటున్నావు కదా...